స్కూల్ బస్సు బోల్తా: రవాణా శాఖ పనితీరుపై విమర్శలు

శ్రీ సత్యసాయి జిల్లా సి.కె.పల్లి మండలం ఓంటికొండ సమీపంలో ధర్మవరం వంశీకృష్ణ నోబెల్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే, ఈ ఘటన రవాణా శాఖ పనితీరుపై విమర్శలకు దారితీసింది. గ్రామస్తులు రిషి విద్యాలయ బస్సు కూడా అతివేగంతో వెళ్తుందని, వేగాన్ని కట్టడి చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్.ఐ సత్యనారాయణ ప్రమాద స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్