ఉరవకొండ: వచ్చేనెలలో డీఎస్సీపరీక్షలు నిర్వహిస్తాం: ముఖ్యమంత్రి

వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో శుక్రవారం ప్రజా వేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తాము ఇచ్చిన ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. యువతకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనదన్నారు. ఈ నెల 15వ తేది లోపల అన్ని ప్రక్రియలు పూర్తవుతాయన్నారు. వచ్చే నెలలో పరీక్షలు నిర్వహిస్తామని, పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి చేసి ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో చేరేలా చూస్తామన్నారు.

సంబంధిత పోస్ట్