నరసన్నపేట: టోల్గేట్ వద్ద అస్తవ్యస్తంగా వాహనాలు

నరసన్నపేట మండలం మడపాం టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారికి ఇరువైపులా భారీ స్థాయిలో వాహనాలు నిలిపివేయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్కింగ్కు అనుమతి లేకపోయినా ఇష్టారాజ్యంగా వాహనాలు నిలుపుతుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారికి ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్లపై కూడా వాహనాలు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్