శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీన జరుగనున్న జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ (ZPTC), మండల ప్రాదేశిక నియోజకవర్గ (MPTC ) ఎన్నికలు నిర్వహణ నిమిత్తం 260 ఆర్టీసీ బస్సులు కేటాయించినట్లు ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ సోమవారం తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు, ఎన్నికల విధులకు బస్సులు కేటాయించడమైనదని చెప్పారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో గల 4 డిపోల నుండి మొత్తం 260 బస్సులు ఎన్నికల విధులకు కేటాయించినట్టు పేర్కొన్నారు.