శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, విద్యార్థులు, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించే అధికారాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి అనుమతితో సెలవులు ప్రకటించవచ్చు. మండల పరిధిలోని అన్ని పాఠశాలలకు సెలవు ఇచ్చే అధికారం ఎంఈఓలకు, అంగన్వాడీ కేంద్రాలకు కార్యకర్తలు తమ సూపర్వైజర్ అనుమతితో సెలవు ప్రకటించే అవకాశం కల్పించారు. మండలం మొత్తంగా పరిస్థితి తీవ్రంగా ఉంటే సీడీపీఓలు, సూపర్వైజర్లు సమన్వయంతో అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు.