ఆముదాలవలస: అనుమానాస్పద ప్రాంతాలలో డ్రోన్ కెమెరా తో పరిశీలన

శ్రీకాకుళం సబ్ డివిజన్ ఎస్డిపిఓ వివేకానంద డీఎస్పీ ఆదేశాల మేరకు ఆమదలవలస సీఐ పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో అనుమానాస్పద ప్రాంతాలలో గురువారం డ్రోన్ కెమెరా సహాయంతో పరిశీలన కార్యక్రమం చేపట్టారు. నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తగు చర్యలు తీసుకునేందుకు డ్రోన్ కెమెరాతో ఈ పరిశీలన చేపట్టామని అన్నారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పర్యవేక్షణ చేయబడిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్