జలుమూరు మండలంలోని చల్లవానిపేట వంశధార డిగ్రీ కళాశాలలో శుక్రవారం శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రమాద పరిస్థితుల్లో మహిళలకు ఇది పెద్ద అండగా నిలుస్తుందని టీం ఇన్‌చార్జ్ ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. మహిళా రక్షణ కోసం రూపొందించిన ఈ యాప్‌ను ప్రతి స్త్రీ తన ఫోన్‌లో ఉంచుకోవాలని సూచించారు.