లావేరు మండలం తాళ్లవలస పంచాయతీలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోఎచ్చెర్ల టీడీపీ సీనియర్ నాయకులు, తెదేపామండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా సెక్రటరీ విజయకుమారితో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మురళీ మోహన్ సచివాలయం సిబ్బంది, మహిళా కార్యకర్తలు, కూటమి నాయకులు ఉన్నారు.