నరసన్నపేట మేజర్ పంచాయతీ నిధులతో పలు సీసీ రహదారుల నిర్మాణాలను చేపడుతున్నామని సర్పంచ్ బూరెల్లి శంకర్రావు, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణ బాబు తెలిపారు. గురువారం నరసన్నపేట గోరువాని చెరువు గట్టు వద్ద రహదారి నిర్మాణానికి గాను ఆరు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసామన్నారు. ఈ క్రమంలో రహదారి పనులకు శంకుస్థాపన చేశామని వివరించారు. రహదారుల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలియజేశారు.