జలుమూరు మండలం అక్కురాడ సచివాలయ పరిధిలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆర్డీవో కె సాయి ప్రత్యూష ఆదేశించారు. బుధవారం సాయంత్రం అధికారులతో మాట్లాడుతూ, వచ్చేనెల తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించారు. ఎటువంటి లోపాలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.