నరసన్నపేట పట్టణంలోని ప్రధాన రహదారిలో సెంటర్ లైటింగ్ పనిచేయకపోవడంతో రాత్రివేళల్లో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి పది తర్వాత రహదారిపై ప్రయాణించడం కష్టంగా ఉందని, పశువులు, కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని, వాహనాలపై వెళ్లేవారు కుక్కల దాడుల భయంతో అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.