నరసన్నపేట: డంపింగ్ యార్డులో మంటలు అదుపు చేస్తున్న సిబ్బంది

నరసన్నపేట డంపింగ్ యార్డులో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం ఈవో పీ ద్రాక్షాయిని వాటర్ ట్యాంకర్లతో పంచాయతీ సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని, అయితే మంటలు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని ఆమె తెలిపారు. దీనిపై దృష్టి సారిస్తామని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్