నరసన్నపేటలోని మారుతీ నగర్ జంక్షన్ వద్ద నిత్యం ట్రాఫిక్ నిలిచిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మురుగు కాలువలపై వేసిన సిమెంట్ పలకలు శిథిలావస్థకు చేరి రోడ్డుపైనే పడి ఉండటంతో సమస్య తీవ్రమవుతోందని, దీనివల్ల పలు గ్రామాలకు రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడుతున్నారని, దుకాణదారులు ఈ పలకలను తొలగించాలని కోరుతున్నారు.