నరసన్నపేట: డంపింగ్ యార్డ్ ను తలపిస్తున్న నాయుడు కోనేరు చెరువు

నరసన్నపేట మండలం సుందరాపురం గ్రామంలోని నాయుడు కోనేరు చెరువులో స్థానికులు వ్యర్థాలను పడవేయడంతో నీరు కలుషితమవుతోంది. పంచాయతీల్లో డంపింగ్ యార్డులు ఉన్నప్పటికీ, చెరువులనే లక్ష్యంగా చేసుకుని వ్యర్థాలను వేయడం వల్ల అవి డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. ఈ విషయంపై సర్పంచ్ పలుమార్లు చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్