నరసన్నపేట: జాతీయ లోక్ అదాలత్ వాయిదా.. సివిల్ జడ్జి వాణి

సివిల్ జడ్జి ఎస్. వాణి తెలిపిన వివరాల ప్రకారం, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 9వ తేదీన జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ వాయిదా పడింది. మంగళవారం సాయంత్రం ఆమె మాట్లాడుతూ, లోక్ అదాలత్ ను జూలై 11వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె సూచించారు. జూలై 11న జరిగే అదాలత్ లో ఎక్కువ కేసులను రాజీ చేయడానికి పోలీసులు, బ్యాంక్ అధికారులు, న్యాయవాదులు సహకరించాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్