నరసన్నపేట పట్టణంలో బుధవారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ బి రామ్ చరణ్ గుప్తా తెలిపారు. ఎమ్మార్వో కార్యాలయం, నేతాజీ వీధి, దేశవానిపేట, శివనగర్ కాలనీ, ఎంపీడీవో కార్యాలయం, గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో ఈ అంతరాయం ఉంటుందని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.