నరసన్నపేట మేజర్ పంచాయతీలో బుధవారం ఎంపీడీవో కె వెంకటేశ్వర ప్రసాద్, థియేటర్, హోటల్ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీలలో నిర్వహిస్తున్న పారిశుధ్యం పట్ల ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన తెలిపారు. డిప్యూటీ ఎంపీడీవో రమేష్ మాట్లాడుతూ, పారిశుధ్యం పట్ల పూర్తి సహాయ సహకారాలు అందించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు.