నరసన్నపేట మేజర్ పంచాయతీలో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. భారీగా బకాయిలు ఉన్న దుకాణాలు, గృహాలకు వెళ్లి చర్యలు చేపట్టారు. పంచాయతీలో రూ. 2.30 కోట్లు ఇంటి పన్నులు రావలసి ఉండగా, రూ. 1.07 కోట్లు మాత్రమే వసూలయ్యాయని అధికారులు తెలిపారు. తక్షణమే పన్నుల వసూళ్లకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.