నరసన్నపేట మండలం రావులవలస పంచాయతీలో ఇటీవల సుమారు కోటి రూపాయలతో నిర్మించిన రహదారి పనులు పూర్తయ్యాయి. అయితే, ఈ రహదారికి ఆనుకుని ఉన్న నరసన్నపేట డంపింగ్ యార్డ్ నుండి వెళ్లే రహదారిలో కల్వర్టు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనిపై అధికారులు దృష్టి సారించకపోతే, రాబోయే వర్షాకాలంలో ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కల్వర్టు నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.