నరసన్నపేట మండలం కరగాం పంచాయతీ చిన్న కరగాం లో తడి చెత్త, పొడి చెత్త కోసం ఏర్పాటుచేసిన సంపద కేంద్రం ప్రక్కనే వ్యర్థాలను పడవేస్తున్న దృశ్యం కనిపించింది. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఈ కేంద్రం పక్కనే వ్యర్థాలు పడవేస్తున్నారు. రహదారికి ఆనుకుని ఉన్న ఈ కేంద్రం వద్ద వ్యర్థాలు ఉండటంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.