నరసన్నపేట: ఉచితంగా న్యాయవాదులనుఏర్పాటు చేస్తాం.. సివిల్ జడ్జి

ఆర్థికంగా వెనుకబడిన ముద్దాయిలకు వారి ఆర్థిక పరిస్థితి మేరకు ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామని సివిల్ జడ్జి ఎస్ వాణి తెలిపారు. సోమవారం నరసన్నపేట సబ్ జైలును ఆమె ఆకస్మికంగా పరిశీలించి, న్యాయవాదులను పెట్టుకోలేని వారు న్యాయాధికార సేవా సంస్థను సంప్రదించాలని సూచించారు. అనంతరం జైలులోని మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలర్ వినయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్