నరసన్నపేట లో సోమవారం రాత్రి కోరాడ రాకేష్ పై దాడి చేసిన గంజాయి బ్యాచ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. నరసన్నపేటలో మాట్లాడుతూ మంగళవారం ఉదయం ఈ విషయం తనకు తెలిసిందని దీనిపై తక్షణమే సిఐ, ఎస్పీ కార్యాలయాలకు కూడా సమాచారం అందించానని పేర్కొన్నారు. ప్రశాంత నరసన్నపేటలో ఇటువంటి ఘటన జరగడం శోచనీయం. వర్తక సంఘాలకు అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.