సారవకోట గ్రామానికి చెందిన గొట్టి ఈశ్వరమ్మ ఇటీవల గుండె వ్యాధి బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆర్థికంగా నిరుపేద కావడంతో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ద్వారా సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం చెక్కు రావటంతో పోలాకి మండలం మబగాం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమెకు 66 వేల 713 రూపాయలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు