మంగళవారం మధ్యాహ్నం కోటబొమ్మాలి మండలం తిలారు రైల్వే స్టేషన్‌లో విశాఖపట్నం నుండి కుర్దా వెళుతున్న గూడ్స్ ట్రైన్ లోని ఒక వ్యాగన్ నుండి గ్యాస్ లీక్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు బి గణేష్, పి అశోక్ బాబు ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ ప్రమాదకరమైనది కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.