నరసన్నపేట మేజర్ పంచాయతీకి చెందిన డంపింగ్ యార్డులో పేరుకుపోయిన వ్యర్థాలను జెసిబితో తొలగించే ప్రక్రియను ఈవో ద్రాక్షాయిని పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వ్యర్థాల నుండి పొగలు రావడంతో అగ్నిప్రమాదాన్ని నివారించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. బయటి వ్యక్తులు ఎలాంటి అగ్నిప్రమాదాలు సృష్టించకుండా ఉండేందుకు, వ్యర్థాలను సురక్షితంగా తొలగిస్తున్నట్లు ఆమె వివరించారు. డంపింగ్ యార్డ్ వద్ద ఇప్పటికే నిఘా ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.