సైబర్ నేరాల పట్ల ప్రాథమిక స్థాయి నుండి అవగాహన పరచుకోవాలని తద్వారా అప్రమత్తత కూడా అవసరమని ఎస్సై కృష్ణ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం మందస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తో పాటు ఫోక్సో, బాల్యవివాహాల చట్టాలపై కూడా అవగాహన పరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బందితోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.