జిల్లాలోని కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయంలో తొక్కిసలాట (Kasibugga Stampede) జరిగింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరారు. హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరిన మంత్రి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గకు చేరుకుంటారు. ఆపై తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.