జి.సిగడాం మండలంలోని వెలగాడ గ్రామంలో చెత్త సంపద కేంద్రాన్ని డీఎల్డీఓ అరుంధతి బుధవారం సందర్శించారు. అనంతరం వర్మీ, నాడేప్ పిట్లను పరిశీలించారు. చెత్తతో వర్మీ తయారీ చేసి అమ్మకాలు జరపాలని సూచించారు. షెడ్‌ను పూర్తిగా ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణారావు, కార్యదర్శి సురేశ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.