శ్రీకాకుళంలో రూ.52 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

శ్రీకాకుళంలో పొట్టి శ్రీరాములు జంక్షన్ నుండి మేదర వీది మీదుగా రంగ్రేజీ వీధి వరకు 52 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే గొండు శంకర్ శంకుస్థాపన చేశారు. నగరంలో సుందర రహదారులు నిర్మించడమే లక్ష్యమని, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ రోడ్డును నిర్మించాలని గుత్తేదారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ కమలాకర్, ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్