శ్రీకాకుళం జిల్లాలో ఈనెల 27వ తేదీన ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ఆదివారం శ్రీకూర్మం గ్రామంలో ఏఎస్ఎల్ భద్రతా బృందం పరిశీలించింది. ఈ తనిఖీలలో కలెక్టర్ దినకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు.