కోట బొమ్మాలి: ఆర్డీవో అప్పలరాజుకు అభినందనలు

కోటబొమ్మాలి తహసిల్దార్ గా పనిచేస్తున్న వ్యక్తి ఆర్డీవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా రెవిన్యూ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. మంగళవారం సాయంత్రం తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ రామచందర్రావు, రీ సర్వే శాఖ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు, సర్వేయర్ కృష్ణమూర్తి, ఆర్ ఐ పవిత్ర, వీఆర్వోలు కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. ఆర్డీవోగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్