కోటబొమ్మాలి: పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి అచ్చన్న

రాష్ట్రంలో ఎన్టీఆర్ భద్రత పెన్షన్లు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందజేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు తెలిపారు. శుక్రవారం కోటబొమ్మాలి మండలం తులసిపేట గ్రామంలో భద్రతా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 1, 20 వేల మంది పెన్షన్లు తీసివేశారని, వాటిని నేడు పునరుద్ధరించామని తెలిపారు. రేపు రైతులకు అన్నదాత సుఖీభవ అందిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్