ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించాలని శక్తి టీం హెచ్ సి ఎం గిరిధర్ తెలిపారు. మంగళవారం సంతబొమ్మాలి మండలం కోటబొమ్మాలి రైల్వే స్టేషన్ లో స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఎక్కువగా ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలనే మృత్యువాత పడుతున్నారని తెలియజేశారు. ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు.