టెక్కలి: శాంతి భద్రతల నడుమ వినాయక ఉత్సవాలు చేపట్టండి

గ్రామాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం లేకుండా నిర్వహించాలని టెక్కలి ఎస్సై 2 రఘునాధ రావు తెలిపారు. శుక్రవారం రాత్రి టెక్కలి మండలం బూరగాం గ్రామంలో గ్రామస్తులకు ఉత్సవాల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఉత్సవాలు చేపట్టే ముందు తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ క్రమంలో కమిటీలను ఏర్పాటు చేసి వాటి వివరాలు అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్