AP: రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ‘ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025’ గెజిట్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీని ప్రకారం 26 జిల్లాలు, ఆరు జోన్లు, రెండు మల్టీజోన్లు అమల్లోకి రానున్నాయి. ఉద్యోగ నియామకాలు, బదిలీలకు దీన్నే ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనను సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ ఆమోదం కోసం పంపింది. ఈ నెల 10న జరిగే కేబినెట్ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదన రానుంది.