మధ్నాహ్న భోజనంపై సర్వే.. టాప్‌లో విశాఖ

AP: ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెల వరకు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రభుత్వం మధ్యాహ్న భోజనంపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ పథకంపై విశాఖపట్నం జిల్లాలో 80.8% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీకాకుళం (77.5%), మన్యం (76.9%), పోలవరం (76.7%), విజయనగరం (76.5%) నిలిచాయి. అనంతపురం 68.2%, కర్నూలు 69.3%, శ్రీసత్యసాయి 70.2%, ప్రకాశం 71.4%, బాపట్ల 71.4% మంది సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕