కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాలు గ్రామంలో 2024 నవంబరులో వీరేశ్ (17) అనే యువకుడిని అతని తల్లి గంగమ్మ, ఆమె వివాహేతర సంబంధం ఉన్న దర్గప్ప కలిసి కత్తితో హత్య చేశారు. కుమారుడు కనిపించడం లేదని తల్లి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసును ఛేదించలేకపోయారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో సిట్ విచారణలో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ జరుగుతుండగానే తల్లి గంగమ్మ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయగా, ప్రధాన నిందితుడు దర్గప్పను అరెస్టు చేశారు.