టెట్ పాస్ కాకుండానే టీచర్ ఉద్యోగం

AP: టెట్ పాస్ కాకుండానే ఓ వ్యక్తి టీచర్ ఉద్యోగం పొందాడు. ఈ ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. ప్రభాకర్ అనే వ్యక్తి టెట్ లేకుండా క్రీడా కోటాలో ఎస్జీటీ ఉద్యోగం పొందాడు. ఆయనపై ఫిర్యాదులు రావడంతో డీఈఓ సుధాకర్ విచారణ జరిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో గుర్తించలేకపోయిన అధికారులు తెలిపారు. ప్రభాకర్‌పై చర్యలకు అధికారులు సిఫార్సు చేశారు. కాగా, కౌతాళం మండలం వల్లూరు ఎలిమెంటరీ స్కూల్‌లో ప్రభాకర్ విధులు నిర్వర్తిస్తున్నారు.

సంబంధిత పోస్ట్