ఏపీలోని పేదల కోసం కేంద్రం మరో 12,370 ఇళ్లు మంజూరు

AP: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన- పట్టణ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజలకు శుభవార్త అందించింది. కొత్తగా 12,370 ఇళ్ల నిర్మాణానికి అనుమతితో పాటు, రూ.185.55 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఇందులో తొలి విడతగా రూ.74.22 కోట్లు విడుదల కానున్నాయి. అయితే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, సెప్టెంబర్ 30లోగా పనులు పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. గడువులోగా పనులు పూర్తి చేయకపోతే కేంద్ర సహాయం నిలిపివేస్తామని హెచ్చరించింది. గతంలో మంజూరైన నిధుల్లోనూ ఎక్కువ మొత్తం ఖర్చు కాలేదని, మిగిలిన నిధులను త్వరగా వినియోగించాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్