AP: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, పేర్లు మారినా పథకాల లక్ష్యం మారదన్నారు. గత రెండేళ్లలో 108 అంబులెన్సుల సంఖ్యను 602 నుంచి 733కు పెంచామని, స్పందన సమయాన్ని 27 నిమిషాల నుంచి 17 నిమిషాలకు తగ్గించామని తెలిపారు. వైద్యశాఖలో 12 వేల నియామకాలు చేపట్టామని, గుంటూరును రాష్ట్రంలో అగ్రగామి క్యాన్సర్ కేంద్రంగా అభివృద్ధి చేశామని చెప్పారు. లివర్, కిడ్నీ, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతికత ఆధారిత వైద్య సేవలపై దృష్టి సారిస్తున్నామని మంత్రి వెల్లడించారు.