వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ చేసే పరిస్థితులు లేవు: శ్రీనివాసవర్మ

AP: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే పరిస్థితులు లేవని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ, ప్లాంట్ కార్యకలాపాల్లో కొన్ని ఏజెన్సీల సహాయం తీసుకోవడం సాధారణ ప్రక్రియేనని తెలిపారు. ఆస్తులన్నీ సంస్థ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ చర్యలు ప్రైవేటీకరణకు దారితీయవని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్