ఈసారి రూ.3.5 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్!

AP: 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు భారీగా పెరగొచ్చని తెలుస్తోంది. పెద్దఎత్తున పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులు వస్తుండడమే దీనికి కారణం. 2025-26లో బడ్జెట్ రూ.3,22,359.33 కోట్లు కాగా.. ఈసారి రూ.3.5 లక్షల కోట్ల వరకు అది ఉంటుందని అంచనా. దాంతో పాటు అగ్రికల్చర్ బడ్జెట్ గతంలో రూ.48,341 కోట్లు కాగా.. ఈసారి రూ.60,000 కోట్లకు పెరుగుతుందని అంచనా. కాగా,  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత పోస్ట్