ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు కానున్నాయి. తిరుపతి, గుంటూరు, రాజమండ్రి జిల్లాలను పోలీస్ కమిషనరేట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై పూర్తిస్థాయి నివేదికలు పంపాలని ముగ్గురు ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యతో శాంతిభద్రతల పరిరక్షణ మరింత పటిష్టమవుతుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్