AP: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్లలో వచ్చే ఏడాది సంక్రాంతికి గృహప్రవేశాలు జరిపిస్తామని టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ విధానాల కారణంగానే టిడ్కో గృహ సముదాయాల్లో సమస్యలు తలెత్తాయని ఆయన ఆరోపించారు. రూపాయికే ఇల్లు ఇస్తామన్న హామీని వైసీపీ నెరవేర్చలేదన్నారు. బ్యాంకుల వాయిదాలు చెల్లించలేక లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.