జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధులపై పోలీసులకు దిశానిర్దేశం

చిత్తూరు జిల్లా నగరి సబ్‌డివిజన్ పరిధిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధులపై పోలీసు అధికారులు, సిబ్బందికి అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఎస్. షాను ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు. ఎన్నికల విధులను అప్రమత్తంగా, క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరి అర్బన్ సీఐ మల్లికార్జున రావు, రూరల్ సీఐ భాస్కర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕