చిత్తూరు జిల్లాలో నవంబర్ 5న జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. జిల్లాలో 24 జడ్పీటీసీ, 300 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 10, 26, 821 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1, 138 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఎన్నికల విధుల కోసం 1, 618 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు.