ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: భారతి

ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం. ఎస్. భారతి తెలిపారు. బాల్య వివాహాలు, మత్తు పదార్థాలు, లైంగిక వేధింపుల నిరోధక చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21న చెక్కు బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సహాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕