చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీ కోట మండలంలో పదవీ విరమణ చేసిన ఎంపీడీవో వెంకటేశ్వరరావును, అదే మండల ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ జీ. శ్రీనివాసులు (వాసు) కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన అందించిన సేవలను కొనియాడుతూ, పదవీ విరమణ అనంతర జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.