పలమనేరు పట్టణంలోని కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ తెలిపారు. లోక్అదాలత్లో సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తామన్నారు. రాజీకి అనువైన కేసులను పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. లాయర్లు, అధికారులు విజయవంతానికి కృషి చేయాలని కోరారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.