పుంగనూరు: అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు పూర్తి కావాలి

పుంగనూరు పట్టణంలోని పుంగమ్మచెరువుపై చేపట్టిన రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బిజెపి నాయకులు అయుబ్ ఖాన్ ఆరోపించారు. శనేశ్వర స్వామి గుడిలో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని ఆయన చూపించి, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఈ దుమ్ము సమస్యకు ముగింపు ఎప్పుడని, అధికారులు మేల్కొంటారా అని ఆయన అన్నారు. సగం ఆగిపోయిన పనుల వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్